కుటుంబంతో కలిసి ఆడండి.. మెదడుకు పదును పెట్టండి!
- కుటుంబంతో కలిసి వ్యాయామం చేస్తే మెదడు చురుకుదనం
- పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగుపడినట్లు అధ్యయనంలో గుర్తింపు
- పెద్దల్లో సమాచార ప్రాసెసింగ్ సామర్థ్యం పెరుగుదల
- 45 నిమిషాల ఆటలతోనే ప్రయోజనాలు
- తల్లిదండ్రులు, పిల్లలు ఒకరికి ఒకరు ప్రేరణగా మారుతున్న వైనం
- వ్యాయామం తర్వాత ఇన్సులిన్ వినియోగం తగ్గినట్లు గుర్తింపు
పిల్లలతో కలిసి కాసేపు ఆటలు ఆడటం కేవలం సరదాకే కాదు.. మెదడు పనితీరును మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుందని తాజా అధ్యయనం చెబుతోంది. కుటుంబ సభ్యులంతా కలిసి చేసే శారీరక వ్యాయామం జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు.
ప్రపంచవ్యాప్తంగా చాలామంది తగినంత శారీరక శ్రమ చేయడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. పెద్దల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు, ప్రతి ఐదుగురు పిల్లల్లో నలుగురు కనీస వ్యాయామం చేయడం లేదని వెల్లడించారు. దీనివల్ల మధుమేహం వంటి వ్యాధులతో పాటు మెదడు పనితీరుపైనా ప్రభావం పడుతోంది.
ఈ నేపథ్యంలో పరిశోధకులు 24 కుటుంబాలతో మాట్లాడి, శారీరక కార్యకలాపాలకు అడ్డంకులు ఏంటో అధ్యయనం చేశారు. ఖర్చులు, సమయం లేకపోవడం ప్రధాన కారణాలుగా తేలాయి. అయితే పిల్లలు చురుగ్గా ఉంటే తల్లిదండ్రులు కూడా ప్రేరణ పొందుతున్నారని, అదే విధంగా తల్లిదండ్రులు వ్యాయామం చేస్తే పిల్లలు కూడా వారిని అనుసరిస్తున్నారని గుర్తించారు.
దీంతో కుటుంబ సభ్యులందరూ కలిసి పాల్గొనగలిగేలా ‘ట్యాగ్ రగ్బీ’ ఆధారంగా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. 16 కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. 45 నిమిషాల పాటు వ్యాయామం, ఆటలు ఆడిన తర్వాత వారి శారీరక, మానసిక సామర్థ్యాలను పరీక్షించారు.
ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వ్యాయామం చేసిన తర్వాత తల్లిదండ్రుల శరీరం ఆహారాన్ని జీర్ణం చేసేందుకు తక్కువ ఇన్సులిన్‌ను ఉపయోగించినట్లు గుర్తించారు. పిల్లల్లో వర్కింగ్ మెమరీ మెరుగుపడగా, పెద్దల్లో సమాచారాన్ని వేగంగా అర్థం చేసుకుని స్పందించే సామర్థ్యం పెరిగింది. ఈ ప్రభావం కనీసం 45 నిమిషాల వరకు కొనసాగినట్లు పరిశోధకులు తెలిపారు.
అయితే ఇది చిన్న స్థాయి అధ్యయనం మాత్రమేనని, దీర్ఘకాల ప్రయోజనాలపై ఇంకా పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అయినప్పటికీ కుటుంబ సభ్యులు కలిసి చేసే ఫిజికల్ యాక్టివిటీస్ ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరుకూ మేలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.